ISRO Apprentice | ఇస్రో పరిధిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 462 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 273 గ్రాడ్యుయేట్, 189 టెక్నీషియన్ అప్రెంటిస్లను ప్రత్యేక సెలక్షన్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూ VSSC క్యాంపస్లో, మనకాడులోని కార్తిక తిరునాల్ గవర్నమెంట్ వొకేషనల్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో జూలై 25న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు మాత్రమే హాజరు కావాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
అర్హతలు
ఏరోనాటికల్/ఏరోస్పేస్, కెమికల్ ఇంజినీరింగ్, టెక్నీషియన్ అప్రెంటిస్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి డిప్లొమా/ బీఈ/ బీటెక్ (డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్/ఇంజినీరింగ్ అండ్ నాన్-ఇంజినీరింగ్/హోటల్ మేనేజ్మెంట్/క్యాటరింగ్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, పుట్టిన తేదీకి రుజువుగా పదో తరగతి లేదా తత్సమాన సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు అవసరమైన ధ్రువీకరణ (Certificates) పత్రాలు ఒరిజినల్, జీరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. రిజర్వేషన్ అభ్యర్థులు వారికి సంబంధించిన కుల, ఆదాయ, వికలాంగ తదితర ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. వయస్సు 28 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులను మెరిట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్లకు రూ. 10,000 వరకు ఇస్తారు.