Toxic Movie | యశ్ ‘టాక్సిక్’ టికెట్ రేట్లు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Toxic Movie | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) రేపు (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Government | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) రేపు (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హోమ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకుని రూ. 50, అలాగే మల్టీప్లెక్స్‌లు మరియు స్పెషల్ థియేటర్లలో రూ. 100 వరకు అదనంగా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఇక ఈ పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి సెప్టెంబర్ 4 వరకు పది రోజుల పాటు అమలులో ఉంటాయి. అలాగే ఈ పది రోజుల పాటు రోజుకు అదనంగా ఒక షోతో కలుపుకుని మొత్తం 5 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు మరికొన్ని కీలక నిబంధనలను కూడా ఖరారు చేసింది. సినీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు నిర్మాత సంస్థ ‘కేవీఎన్-మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ’ తక్షణమే రూ. 1 కోటి విరాళంగా అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధులను పూర్తిగా సినీ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయనున్నారు.
అలాగే, సినిమా ప్రదర్శన సమయంలో మాదకద్రవ్యాలు, నార్కోటిక్స్ మరియు సైబర్ క్రైమ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే ప్రత్యేక ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలన్నీ ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు మరియు సినిమా లైసెన్సింగ్ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

