Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి ఔట్.. బాబీ సినిమాపై కొత్త ప్రచారం .!
Chiranjeevi | ఒకప్పుడు సంక్రాంతి అంటే తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద పండుగగా భావించేవారు. ఆ సీజన్లో సినిమా విడుదలైతే భారీ వసూళ్లు ఖాయమనే నమ్మకం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి పలువురు స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కోసం తీవ్ర పోటీ నెలకొంటోంది. ఫలితంగా స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం, కలెక్షన్లు విడిపోవడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Chiranjeevi | ఒకప్పుడు సంక్రాంతి అంటే తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద పండుగగా భావించేవారు. ఆ సీజన్లో సినిమా విడుదలైతే భారీ వసూళ్లు ఖాయమనే నమ్మకం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి పలువురు స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కోసం తీవ్ర పోటీ నెలకొంటోంది. ఫలితంగా స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం, కలెక్షన్లు విడిపోవడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై ఓ ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గరిష్ట స్థాయిలో వసూళ్లు రావాలంటే పోటీ లేకుండా సోలోగా విడుదల చేయడం ఉత్తమమనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి సమయంలో కనీసం రెండు లేదా మూడు పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో, కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారట. అందుకే సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని సమ్మర్ లేదా మరో అనుకూలమైన ఫెస్టివల్ సీజన్లో సినిమాను విడుదల చేసే అంశంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే విడుదల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సరైన సమయాన్ని ఎంచుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగానే మెగాస్టార్ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటుందా? లేక ముందుగా అనుకున్నట్లుగానే పండుగ సీజన్లో విడుదలవుతుందా? అన్నది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విడుదల తేదీ మారితే, స్టార్ హీరోల సినిమాల రిలీజ్ వ్యూహాల్లో అది కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

