బెంగళూరు: ప్రతిష్టాత్మక బిల్లీజీన్ కింగ్ కప్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి మొదలుకానున్న ప్లేఆఫ్స్‌లో మొత్తం 21 దేశాలు ఏడు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి.
గ్రూపు-జీలో ఆతిథ్య భారత్‌తో పాటు స్లోవేనియా, నెదర్లాండ్స్ ముఖాముఖి ఆడనున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా/ఓషియాన గ్రూపు-1 టైలో అదరగొట్టిన భారత్ టోర్నీ సుదీర్ఘ చరిత్రలో రెండోసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.