ముంబై : ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. మంగళవారం ఏకపక్షంగా సాగిన తొలి ఎలిమినేటర్ పోరులో బెంగళూరు బుల్స్ 56-24 స్కోరుతో గత సీజన్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీని చిత్తుగా ఓడించింది. బెంగళూరు రైడర్లు వికాస్ కండోలా(13), భరత్(15) సూపర్ టెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
నువ్వానేనా అన్నట్టు సాగిన రెండో ఎలిమినేటర్‌లో తమిళ్ తలైవాస్, యూపీ యోధాస్ ప్రతీ పాయింట్‌కు చెమటోడ్చాయి. నిర్ణీత సమయానికి స్కోరు 36-36గా సమమయింది. విజేతను తేల్చడానికి జరిగిన టైబ్రేక్‌లో తమిళ్ తలైవాస్ 6-4 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరుకుంది.