Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టును ప్రకటించారు. చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బెంగాల్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గాయం నుంచి కోలుకుతున్న తర్వాత బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. దేశవాళీ సీజన్ రంజీ ట్రోఫీతో ప్రారంభమైంది.
ఇందులో షమీ నాలుగు మ్యాచ్‌లలో 18.60 సగటుతో 20 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నమెంట్లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఏడు మ్యాచుల్లో 14.93 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ జట్టులో భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం బెంగాల్ జట్టు బాధ్యతలు అభిమన్యు ఈశ్వరన్‌కు అప్పగించారు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బీలో ఉంది. డిసెంబర్ 24న రాజ్‌కోట్‌లో విదర్భతో తొలి మ్యాచ్ ఆడనున్నది. ఇదే గ్రూప్‌లో అసోం, బరోడా, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి.
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.