చెన్నై : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే యేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నాడు. పనిభారం ఎక్కువవడంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది.
ఈ యేడాది ఐపీఎల్‌కు ముందు చెన్నై జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న స్టోక్స్ మోకాలి నొప్పితో బాధపడుతూ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వన్డే క్రికెట్‌నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనతో ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు.