అడిలైడ్: ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంబానికి ముందు సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ దుమ్మురేపాడు. గాయం బాధను అధిగమిస్తూ అడిలైడ్ ఇంటర్నేషనల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-7 (8/10), 7-6(7/3), 6-4తో అమెరికాకు చెందిన సెబాస్టియన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభం కానుండగా.. ఇక్కడ మంచి రికార్డు ఉన్న జొకోవిచ్ పదోసారి టైటిల్ నెగ్గాలని తహతహలాడుతున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక 6-2, 7-6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవాపై విజయం సాధించింది.