IPL Captains Meeting : క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. పంతొమ్మిదో సీజన్‌కు మరో నాలుగు రోజులే ఉంది. టోర్నీ సమీపిస్తున్నందున పది జట్ల కెప్టెన్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సమావేశం నిర్వహించనుంది. మార్చి 25(బుధవారం) ఐపీఎల్ కెప్టెన్లతో భేటీ సాయంత్రం 4 గంటలకు జరుగనుది. ఈ సందర్భంగా బీసీసీఐ, పది జట్ల సారథుల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ తొలి దశ మ్యాచ్‌లు మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దాంతో, పది జట్ల ఆటగాళ్లు నెట్స్ ప్రాక్టీస్, సన్నాహక ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నారు. మెగా ఈవెంట్‌కు మరో నాలుగు రోజులే ఉన్నందున అందరు కెప్టెన్లతో బీసీసీఐ భేటీ అవ్వనుంది. మార్చి 25 (బుధవారం) సాయంత్రం పది జట్ల సారథులతో బీసీసీఐ కీలక అంశాలపై చర్చించనుంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ కెప్టెన్లతో సమావేశం ఉంటుందని మంగళవారమే ఫ్రాంచైజీలకు సమాచారం వెళ్లింది.
🚨 BIG UPDATES ON IPL TEAM CAPTAINS MEETING 🚨
“ The IPL2026 Captains’ Meeting is set to take place at the BCCI HQ in Mumbai from 12 PM to 6 PM. For the Photoshoot and team manager meeting ” [ Gaurav Gupta TOI ]
— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 24, 2026
బీసీసీఐ మ్యాచ్ రిఫరీలు జవగళ్ శ్రీనాథ్, నితిన్ మీనన్, అంపైర్ ప్యానెల్ సభ్యులు కెప్టెన్లతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఇన్నింగ్స్ టైమర్(60 సెకన్లు), ఇంపాక్య్ ప్లేయర్(Impact Player) నిబంధన, కంకషన్ సబ్‌స్టిట్యూట్, ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు, బ్యాట్ చెకింగ్, బంతిని మార్చడం, బంతిపై లాలాజలం రుద్దడం, రిటైర్డ్ ఔట్ నియమాలు.. వంటివి ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ అంశాలపై మ్యా్చ్ రిఫరీలు, అంపైర్లు పది జట్ల కెప్టెన్ల అభిప్రాయాలు, సందేహాలను తెలుసుకోనున్నారు.