BCCI : దేశవాళీ క్రికెట్ కొత్త సీజన్‌కు భారత క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. శనివారం జరిగిన సమావేశంలో బీసీసీఐ పెద్దలు దేశవాళీ సీజన్ షెడ్యూల్ ఖరారు చేశారు. విరామం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణపై క్రికెటర్లు ఫిర్యాదు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. లీగ్‌ను రెండు దశలుగా నిర్వహించాలని బీసీసీఐ తీర్మానించింది. అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో రంజీ ట్రోఫీ నిర్వహిస్తామని భారత బోర్డు తెలిపింది.
దులీప్ ట్రోఫీతో దేశవాళీ సీజన్ 2025-26 ప్రారంభం కానుంది. ఆగస్టు 28 ను మొదలయ్యే ఈ టోర్నీ సెప్టెంబర్ 15న ముగుస్తుంది. ఆ తర్వాత ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకూ జరగనుంది. ఇందులోరంజీ విజేత డిఫెండింగ్ ఛాంపియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
🚨 NEWS 🚨
BCCI convened its 28th Apex Council Meeting on Saturday and made the following key decisions 👇
🔹 A committee to be constituted to formulate comprehensive guidelines aimed at preventing occurrences similar to the victory celebrations in Bengaluru. The committee will… pic.twitter.com/FXEqMO5gU4
— BCCI (@BCCI) June 14, 2025
తదనంతరం రంజీ ట్రోఫీ షురూ అవుతుంది. అంతేకాదు ఈసారి రంజీ ట్రోఫీ సరికొత్తగా ఉండనుంది. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక జట్టు ప్రమోట్ అవుతుంది. మరొక జట్టు 206-27 సీజన్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి 28 వరకూ నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి.