Asian Games : ఆసియా క్రీడల ఆరంభానికి ముందే మౌలిక వసతులపై దుమారం రేగుతోంది. జపాన్‌లోని ఐచీ- నగోయాలో మెగా ఈవెంట్‌కు మరో 23 రోజులే ఉండగా.. క్రికెటర్లకు బస, వసతి ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆటగాళ్ల సౌకర్యార్థం నిర్వాహకులు మెరుగైన చర్యలు తీసుకోకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెంట్లోనే డ్రెస్సింగ్ రూమ్, 500 మీటర్ల దూరంలో వాష్‌రూమ్.. వంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతోంది బీసీసీఐ. టోర్నీ ఆరంభం కల్లా పరిస్థితిలో మార్పు లేకుంటే బీ టీమ్‌ను పంపాలనే ఆలోచనతో ఉంది బీసీసీఐ.
సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి. టోర్నీకి సమయం దగ్గరపడినా ఐచీ నగోయ నగరంలో క్రికెటర్లకు వసతుల కల్పన అధ్వాన్నంగా ఉంది. వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు పాల్గొననున్న ఈ క్రీడల్లో వారి సౌకర్యార్థం మెరుగైన ఏర్పాట్లు చేయకపోవడంపై బీసీసీఐ కోపంతో ఊగిపోతోంది. ఆసియా క్రికెట్ మండలి సైతం ఐచీ – నగోయలో బస, వసతి ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
The build‑up to the Asian Games 2026 cricket tournament has taken an unexpected twist, with the BCCI and the Asian Cricket Council (ACC) expressing dissatisfaction over the facilities and arrangements in Japan.https://t.co/fX7bBwsn6K
— Firstpost Sports (@FirstpostSports) August 28, 2026
‘జపాన్‌లో ఆసియా క్రీడల ఏర్పాట్ల పట్ల ఏసీసీ, బీసీసీఐ సంతృప్తిగా లేవు. అందుకని పరిశీలకులను జపాన్ పంపిస్తాం. వారు అక్కడి పరిస్థితులపై మాకు నివేదిక ఇస్తారు. టెంట్లలో డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేశారని, వాష్‌రూమ్‌లు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. దాంతో, క్రికెటర్లు అసౌకర్యానికి గురవుతారనే విషయాన్ని ఏసీసీ సమావేశంలో జపాన్ ఒలింపిక్ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అంతేకాదు హోటల్ గదులు కూడా చిన్నగా ఉన్నాయి’ అని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐతో పేర్కొన్నాయి.
Dressing Room In Tents, Washroom 500m Far: BCCI Slams Asian Games Conditions: Report#AsianGameshttps://t.co/AnfioxX2IG pic.twitter.com/JtlUREV9gE
— NDTV Sports (@Sports_NDTV) August 28, 2026
టోర్నీలో క్రికెట్ మ్యాచ్‌ల ఆరంభానికల్లా వసతులు మెరుగవ్వకంటే.. పురుషుల, మహిళల విభాగంలో ఎంపిక చేసిన బృందం స్థానంలో బీ టీమ్‌ను పంపించాలని భారత బోర్డు భావిస్తోంది. చైనాలోని హంగ్జూలో స్వర్ణంతో మెరిసిన భారత జట్లు.. ఈసారి కూడా పసిడితో తిరిగిరావాలనే పట్టుదలతో ఉన్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు.. సెప్టెంబర్ 17 నుంచి 22వ తేదీవరకూ మహిళల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
భారత పురుషుల స్క్వాడ్ – శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్, బుమ్రా.
భారత మహిళల స్క్వాడ్ – హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్) స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ప్రతీకా రావల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.