Devjit Saikia | రోహిత్ గొప్పగా ఆడుతున్నాడు.. మీకు ఇంకేం కావాలి..?
Rohit Sharma : వచ్చే వన్డేప్రపంచకప్ ఆడాలనుకుంటున్న రోహిత్ శర్మ(Rohit Sharma) భవితవ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. ఇప్పటికిప్పుడు ఆ ముప్పేమి లేదనిపిస్తోంది. గురువారం బీసీసీఐ సమీక్షా సమావేశం అనంతరం సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) మాట్లాడుతూ హిట్‌మ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Devjit Saikia: వచ్చే వన్డేప్రపంచకప్ -2027 ఆడాలనుకుంటున్న రోహిత్ శర్మ(Rohit Sharma) భవితవ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన అతడిని తప్పించి యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)కు అవకాశమిస్తారనే వార్తలు వినిపిస్తున్న వేళ.. ఇప్పటికిప్పుడు ఆ ముప్పేమి లేదనిపిస్తోంది. గురువారం బీసీసీఐ సమీక్షా సమావేశం అనంతరం సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) మాట్లాడుతూ హిట్‌మ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు చూసే ఉంటారు. రోహిత్ గొప్పగా ఆడుతున్నాడు అని సైకియా కామెంట్ చేశాడు. దాంతో.. ప్రస్తుతానికి వన్డే జట్టులో రోహిత్‌కు అవకాశముందనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు బీసీసీఐ కార్యదర్శి.
ఫామ్ పరంగా విమర్శలు ఎదుర్కొటున్న రోహిత్ శర్మకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వన్డేల్లో విధ్వంసక ఓపెనరైన హిట్‌మ్యాన్‌ను ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో ఆడించాలని భారత బోర్డు అనుకుంటోంది. అనభవజ్ఞుడైన రోహిత్‌ను వెస్టిండీస్ పర్యటనలో ఆడించాలని వినతులు వస్తున్న వేళ.. బీసీసీఐ అందుకు సానుకూలంగా ఉందనిపిస్తోంది.
VIDEO | Mumbai: “No difficulties expected in Japan; Rohit playing superbly,” says BCCI Secretary Devajit Saikia (@lonsaikia), amid speculation that Rohit Sharma could be dropped from the upcoming ODI series against the West Indies.
(Full video available on PTI Videos -… pic.twitter.com/kWeU64ZjXq
— Press Trust of India (@PTI_News) September 3, 2026
ఎందుకంటే.. తాజాగా సమీక్ష సమావేశం అనంతరం సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘మీరూ చూసే ఉంటారు. రోహిత్ గొప్పగా ఆడుతున్నాడు. మీకు ఇంతకంటే ఏం కావాలి. చివరి మ్యాచ్‌లో రోహిత్ శతకం సాధించాడు. అలాంటప్పుడు ఎందుకీ ఊహాగానాలు. మీరు అడిగే అనవసర ప్రశ్నలకు నేను బదులివ్వను’ అని మీడియాతో అన్నాడుఅతడి మాటలను బట్టి.. స్వదేశంలో విండీస్‌తో వన్డే సిరీస్ స్క్వాడ్‌లో రోహిత్ ఉండడం ఖాయమనిపిస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో యశస్వీ జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, టీ20 సారథి శ్రేయాస్ అయ్యర్లు మాత్రం రోహిత్ ఉండాల్సిందేనని పట్టుపట్టారని సమాచారం. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ మొదలవ్వనుంది. ఆపై టీమిండియాతో ఐదు టీ20 సిరీస్ ఆడనుంది కరీబియన్ టీమ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

