BCCI : హిందువులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌తో భారత ప్రభుత్వం ద్వైపాక్షిక సంబంధాలను నిలిపివేసింది. బంగ్లాలో మైనార్టీలపై హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ (Mustafizur Rehman)ను కొనడాన్ని తప్పు పడతున్నారు కొందరు. దాంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను పంతొమ్మిదో సీజన్ ఆడనిస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. ముస్తాఫిజుర్ వ్యవహారంపై ఎట్టకేలకు బీసీసీఐ మౌనం వీడింది.
బంగ్లాదేశ్‌లో తాజాగా నెలకొన్న హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా ఆ దేశస్థుడైన ముస్తాఫిజుర్‌పై ఐపీఎల్లో వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ముస్తాఫిజుర్‌ను వేలంలో కొనడంపై ఈమధ్యే ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ థాకూర్( Devkinandan Thakur) మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున.. ఐపీఎల్లో ఆ దేశస్థుడిని ఆడించాలనకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ సహ- యజమాని షారుక్ ఖాన్(Shah Rukh Khan)పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. బీసీసీఐ మాత్రం ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్లో ఆడించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది.
Who Is Mustafizur? Bangladesh Pacer At The Centre Of Major IPL Controversy https://t.co/5VGGsx7YNb pic.twitter.com/uOY8dyP9cI
— CricketNDTV (@CricketNDTV) January 2, 2026
Abhishek Rajput to Shahrukh Khan : if mustafizur rehman plays in IPL I will th√ash both mustafizur and srk🔥 pic.twitter.com/cgY9jdg5Co
— Aditya (@Warlock_Aditya) December 29, 2025
‘విదేశీ క్రికెటర్ల విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అది బంగ్లాదేశానికి చెందినవారైనా సరే ఇదే నియమం వర్తిస్తుంది. ఆ దేశ ఆటగాళ్లు ఏడుగురు వేలంలో పాల్గొన్నారు. కానీ, ఒక్కరికే కాంట్రాక్ట్ దక్కింది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ ఆడించాలా? వద్దా? అనేది మా చేతుల్లో లేదు. ఇప్పటివరకైతే బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడనివ్వకూడదని భారత ప్రభుత్వం నుంచి ఆదేశాల రాలేదు. బీసీసీఐ ప్రభుత్వం ఆజ్ఞల మేరకే నడుచుకుంటుంది. ముస్తాఫిజుర్ విషయంలో ప్రభుత్వం ఆదేశాలు వచ్చేంత వరకూ ఎదురుచూస్తాం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Make way for Mustafizur Rahman, @KKRiders fans! 💜
The left-arm quick will play for the 3⃣-time champions at INR 9.2 Crore 💰#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/TWALm1MdKx
— IndianPremierLeague (@IPL) December 16, 2025
డిసెంబర్ 19న అబుధాబీలో జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొన్నది. గతంలో పలు ఐపీఎల్ జట్లకు ఆడిన ముస్తాఫిజుర్ 60 మ్యాచుల్లో 65 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్(2024), ఢిల్లీ క్యాపిటల్స్(2022-23), రాజస్థాన్ రాయల్స్(2021), ముంబై ఇండియన్స్(2018) వంటి ఫ్రాంచైజీల జెర్సీతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బరిలోకి దిగాడు.