టెస్టుల కోసం వన్డేలకు దూరం!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.
- న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చే యోచనలో బోర్డు
ఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. వచ్చే వారం మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనున్న టీమిండియా.. అతడిని వన్డేలకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.
ఈ టూర్లో మొదట ఇరుజట్ల మధ్య ఈ నెల 22-నవంబర్ 1 మధ్య ఐదు టీ20లు జరుగనుంది. మూడు రోజుల విరామం తర్వాత వన్డే సిరీస్ అవుతుంది. నవంబర్ 15న వన్డే సిరీస్ ముగియనుండగా 19 నుంచి టెస్టులు మొదలవ్వాల్సి ఉంది. అయితే వన్డేలు ముగిసిన వెంటనే టెస్టులకు సిద్ధమవడం బుమ్రా వర్క్లోడ్పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అందుకే ఈ పేసుగుర్రాన్ని వన్డేలకు విశ్రాంతినిచ్చి టెస్టులకు సన్నాహకంగా భారత్-ఏ జట్టు ఆడబోయే ఒక మ్యాచ్‌లో ఆడించాలనే ప్లాన్‌లో ఉంది.
దీనిపై బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. రాబోయే కివీస్ టూర్లో అతడిని ఏ ఫార్మాట్లో ఆడించాలనేది అత్యంత కీలకం. అయితే వన్డేలు ఆడిన వెంటనే టెస్టులకు తీసుకురావడం బుమ్రాకు పనిభారం పెంచడమే. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కీలకం. అది ముగిశాక వచ్చే ఏడాది బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కూడా ఉంది. ఇటువంటి కీలక సిరీస్‌ల దృష్ట్యా బుమ్రాను ముఖ్యమైన మ్యాచ్‌లలోనే బరిలోకి దింపాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది’ అని చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

