TeamIndia – Westindies Tour : వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final) ఆడిన భారత జట్టు మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు బయలుదేరనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా షెడ్యూల్ విడుదల చేసింది. టెస్టు మ్యాచ్ ఎప్పుడంటే..? మొదటి టెస్టు జూలై 12 – 16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
స్వదేశంలో మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దాంతో, ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా పెట్టకున్నరోహిత్ సేన వెస్టిండీస్ పర్యటనను సీరియస్‌గా తీసుకోనుంది. ఇప్పటికే బీసీసీఐ 20మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ సిరీస్‌లో రాణించిన వాళ్లకు ఆ జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది.