ఢిల్లీ : అత్యంత ఉత్కంఠ నడుమ జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ తర్వాత ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. మునాఫ్‌పై జరిమానా ఎందుకు వేసిందన్న విషయాన్ని బీసీసీఐ స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ మ్యాచ్ సందర్భంగా అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకే జరిమానా పడినట్టు తెలుస్తున్నది. ఆటగాళ్లకు ఓ సందేశం ఇవ్వడానికి గాను ఢిల్లీ రిజర్వ్ ఆటగాడిని మైదానంలోకి వెళ్లాలని మునా ఫ్ సూచించగా అక్కడే ఉన్న అంపైర్ అందుకు నిరాకరించాడు. దీంతో మునా ఫ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన వీడి యో సోషల్ మీడియాలో వైరలైంది.