ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం వెండితెరకెక్కనుంది. ‘లవ్ ఫిల్మ్స్’నిర్మాణ సంస్థ దాదా బయోపిక్‌ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గంగూలీ గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరి సిల్వర్ స్క్రీన్‌పై దాదాగా నటించేదెవరనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.