Inderjit Singh Bindra : భారత క్రికెట్ వికాసానికి ఎనలేని సేవలందించిన ఇంద్రజిత్ సింగ్ బింద్రా (Inderjit Singh Bindra) కన్నుమూశాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన 84 ఏళ్ల వయసులో ఢిల్లీలోని నివాసంలో మరణించారు. దూరదర్శినిపై కేసులో వార్తల్లో నిలిచిన ఇంద్రజిత్.. క్రికెట్ పరిపాలన దక్షుడిగా తన ముద్ర వేశాడు. భారత క్రికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో కీలకమైన ఆయనది కీలక పాత్ర. ఇంద్రజిత్ మృతిపట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది.
భారత క్రికెట్లో దూరదర్శన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఇంద్రజిత్ 1994లో సుప్రీం కోర్టులో కేసు వేశారు. క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారంలో ఆ సంస్థ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు ఇంద్రజిత్‌కు అనుకూలంగా రావడంతో భారత జట్టు మ్యాచ్‌ల ప్రసారం కోసం కొత్త బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఏర్పడ్డాయి. ఆయన చొరవతోనే ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం భారత్ అతిపెద్ద టీవీ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది.
BCCI expresses its deep sorrow at the passing of Former President of the BCCI Mr Inderjit Singh Bindra.
Mr Bindra was one of the most influential figures in Indian cricket administration, whose vision and leadership helped shape the way the game is governed in the country and… pic.twitter.com/sOafsmiGYM
— BCCI (@BCCI) January 26, 2026
ఇంద్రజిత్ మరణ వార్త తెలియగానే బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ సె క్రటరీ దేవజిత్ సైకియాలు సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. ‘ఇంద్రజిత్ గొప్ప దార్శనికత గల పరిపాలకుడు. ఆయన నాయకత్వ పటిమ కారణంగానే ప్రపంచ క్రికెట్లో భారతదేశం కొత్త పాత్రను పోషించింది. ఆయన అధ్యక్ష బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యవస్థ ఏర్పాటులో.. ఆటగాళ్లుకు, పరిపాల విభాగంలోని వాళ్లకు అవసరమైన సేవలు అందించే సంస్థలకు రూపమివ్వడంలో ఇంద్రజిత్ కృషి అమోఘం. భారత క్రికెట్ మాజీ అధ్యక్షుల్లో దిగ్గజమైన ఇంద్రజిత్ మరణం పట్ల చింతిస్తున్నాం’ అని మిథున్ మిన్హాస్ పేర్కొన్నాడు.
The Board of Control for Cricket in India (BCCI) expresses its deep sorrow at the sad demise of Inderjit Singh Bindra, former President of the BCCI, who passed away in New Delhi on January 25, 2026, at the age of 84: BCCI pic.twitter.com/1qFANrg2sa
— ANI (@ANI) January 26, 2026
‘బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నా. ఆయన వారసత్వం భావి తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని జై షా వెల్లడించాడు. భారత క్రికెట్ ఒక ప్రభావశీలుడైన వ్యక్తిని కోల్పోయింది’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నాడు.
మాజీ అధ్యక్షులు ఎన్‌కేపీ సాల్వే, జగ్మోహన్ దాల్మియా 1987 వన్డే ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమివ్వడంలో ఇంద్రజిత్ కీలక పాత్ర పోషించాడు. యూనైటెడ్ కింగ్డమ్ బయట జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఇదే కావడం విశేషం. పంజాబ్ క్రికెట్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇంద్రజిత్ మొహాలీ స్టేడియం నిర్మాణానికి కృషి చేశారు. అనంతరం ఆ స్టేడియానికి పీసీఏ ఆయన పేరు పెట్టింది. 1993 నుంచి 1996 మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్‌గా పనిచేసిన ఇంద్రజిత్. పంజాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా 36 ఏళ్లు కొనసాగారు. 2014 తర్వాత క్రికెట్ పాలనా బాధ్యతల నుంచి ఆయన వైదొలిగాడు.