BCCI : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీకి సీనియర్ పేసర్‌ను మహ్మద్ షమీ (Mohammed Shami)ని ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పరిస్థితులు బాగా తెలిసిన, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల షమీ ఉంటే భారత్‌కు కలిసొచ్చేదని పలువురు వాపోతున్నారు. బుమ్రా మూడే టెస్టులు ఆడినందున సిరాజ్‌కు తోడుగా.. షమీ ఉండేవాడని అందరూ అభిప్రాయపడుతున్న వేళ బీసీసీఐ (BCCI) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లండ్ పర్యటనకు ఉద్దేశపూర్వకంగా షమీపై వేటు వేశారనే వార్తల్లో నిజం లేదని చెప్పింది భారత బోర్డు.
‘అందరూ అనుకుంటున్నట్టు ఇంగ్లండ్ పర్యట(England Tour)నకు షమీని పక్కనపెట్టేయలేదు. అనుభవజ్ఞుడైన అతడిని స్క్వాడ్ ఎంపిక చేయడానికి ముందు సెలెక్టర్లు సంప్రదించారు. ఫిట్నెస్ కారణంగానే షమీని తీసుకోలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. అంతేకాదు సెలెక్టర్లకు భారత పేసర్ ఏం చెప్పాడో కూడా తెలిపింది.
‘ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన షమీని కచ్చితంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలనుకున్నాం. సుదీర్ఘ అనుభవం గల అతడి సేవలు జట్టుకు అసవరమని అందరం భావించాం. కానీ, షమీ మాత్రం తాను ఫిట్‌గా ఉన్నాననిగానీ, పక్కాగా సిద్ధంగా ఉన్నాననిగానీ చెప్పలేదు. అతడు ఆత్మవిశ్వాసంగా లేకపోవడంతోనే సిరీస్‌కు ఎంపిక చేయలేదు’ అని బీసీసీఐలోని అధికారి వెల్లడించారు.
BCCI selectors talked with Mohammed Shami ahead of England Tour: Report. Pacer “didn’t…” #BCCI #MohammedShamihttps://t.co/xHer4Dsv7Z
— CricketNDTV (@CricketNDTV) August 11, 2025
వన్డే వరల్డ్ కప్ అనంతరం మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న షమీ.. ఐపీఎల్ 18వ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తనపై గంపెడు ఆశలు పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు షాకిస్తూ తొమ్మిది మ్యాచుల్లో కేవలం 6 వికెట్లతో నిరాశపరిచాడు. ఫామ్‌లేమితో ఇంగ్లండ్ టూర్‌కు దూరమైన అతడు పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతానికి షమీ దేశవాళీపై దృష్టి సారించాడు. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో ఈస్ట్ జోన్ తరపున బరిలోకి దిగుతున్నాడు. ఈ ట్రోఫీలో గనుక షమీ మునపటిలా చెలరేగి వికెట్ల వేట కొనసాగిస్తే.. మళ్లీ టెస్టు, వన్డే జట్టులోకి రావడం లాంఛనమే.
Mohammed Shami is grinding for the comeback 👊🏏#Cricket #MohammedShami #TeamIndia #IndianCricketer pic.twitter.com/qzTTTKrSTC
— CricketTimes.com (@CricketTimesHQ) July 12, 2025