హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముంబై సమీప మార్వేలో నిర్వహించిన ఈ పోటీల్లో గురుకులం నుంచి 7 విద్యార్థులు పాల్గొన్నారు.
వారిలో గ్రీన్ఫ్లీట్ సింగిల్స్‌లో ఝాన్సీ స్వర్ణం సాధించగా, డబుల్స్ విభాగంలో అరవింద్ రజత పతకం నెగ్గాడు. పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సొసైటీ కార్యదర్శి సైదులు అభినందించారు.