Guwahati Test : టెస్టు సిరీస్‌లో ముందంజ వేయాలనుకున్న భారత జట్టు వ్యూహాలు రెండో టెస్టులోనూ ఫలించలేదు. గువాహటి వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడి టీమిండియా బౌలర్లకు పరీక్ష పెట్టారు. పిచ్ బౌలర్లకు పెద్దగా అనుకూలించకపోవడంతో సొమ్ముచేసుకున్న సఫారీ కెప్టెన్ తెంబా బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. కుల్దీప్ యాదవ్(3-48) విజృంభణతో ఐదు వికెట్లు పడినా.. ఆ తర్వాత ముత్తుస్వామి(25 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి విసిగించాడు. అయితే.. రెండో కొత్త బంతితో సిరాజ్ బ్రేకివ్వడంతో ఆట ముగిసే సరికి పర్యాటక జట్టు 6 వికెట్లకు 247 పరుగులు చేసింది.
ఈడెన్ గార్డెన్స్‌లో కంగుతిన్న భారత జట్టుకు రెండో టెస్టులోనూ సవాల్ ఎదురవుతోంది. గువాహటిలో టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సఫారీలు జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. టాస్ గెలిచిన తెంబా బవుమా బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్లు రియాన్ రికెల్టన్(35), ఎడెన్ మర్క్రమ్(38)లు శుభారంభమిచ్చారు. తొలి సెషన్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ వికెట్ ఇవ్వలేదు. క్రీజులో కుదురుకున్న మర్క్రమ్ను రెండో సెషన్లో బుమ్రా వెనక్కి పంపి మొదటి వికెట్ అందించాడు. అంతటితో ఓపెనర్ల 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ కాసేపటికే కుల్దీప్ ఓవర్లో రికెల్టన్ వికెట్ కీపర్ పంత్‌కు దొరికాడు.
Hands as safe as houses! 👌🫴
🎥 Two big wickets courtesy of two fine catches from @ybj_19 and @klrahul 👏
Updates ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/PVJ0MR1sHd
— BCCI (@BCCI) November 22, 2025
ఓపెనర్లు ఔటైనా సఫారీ టీమ్ తడబడలేదు. క్రీజులోకి వచ్చిన బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)తో కలిసి ఆపద్భాదవుడి పాత్ర పోషించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన అతడు ఈసారి క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్ 160 దాటించాడు. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని జడేజా(1-30) విడదీసి ఊరటనిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన స్టబ్స్‌ను కుల్దీప్(3-48) బోల్తా కొట్టించాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ చక్కని క్యాచ్ అందుకోగా 187 వద్ద నాలుగో వికెట్ పడింది.
అయినా సరే సఫారీ మిడిరాల్డర్ బ్యాటర్లు టోనీ జోర్జి(28), ముత్తుస్వామి(25 నాటౌట్)లు వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచారు. అయితే.. రెండో కొత్త బంతితో సిరాజ్ బ్రేకిచ్చాడు. జోర్జి ఆడిన బంతిని పంత్ కుడివైపు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా 246 వద్ద పర్యాటక జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సరికి సఫారీ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.