Record Score In T20’s | సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా జట్టు టీ20 ఫార్మాట్ అధ్యిక స్కోర్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో భాను పానియా అజేయ సెంచరీతో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్లో ఒక మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఈ ఏడాది గాంబియాపై నాలుగు వికెట్లకు 344 పరుగులు చేసిన జింబాబ్వే రికార్డును బరోడా బ్రేక్ చేసింది. సిక్కిం నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 86 పరుగులు మాత్రమే చేసి 263 పరుగుల భారీ ఓటమి పాలైంది. బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శశ్వత్ రావత్ (43), అభిమన్యు సింగ్ (53) తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భాను పానియా బ్యాట్‌తో వీర విహారం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 15 సిక్సర్ల సహాయంతో అజేంగా 134 పరుగులు చేశాడు. భాను పానియా తుఫాన్ ఇన్నింగ్స్‌తో బరోడా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసి రికార్డును నెలకొల్పింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 300కిపైగా పరుగులు చేసిన తొలిజట్టుగానూ బరోడా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని బరోడా నిర్ణయించుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో బరోడా రికార్డుల మోత మోగించింది. ఇది టీ20లో అత్యధిక స్కోరు నమోదు చేయడమే కాకుండా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పింది. సిక్కింపై బరోడా ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు బాదగా.. అందులో భాను ఒక్కడే 15 సిక్సర్లు కొట్టాడు. ఇక బరోడా తరఫున శివాలిక్ శర్మ 17 బంతుల్లో 55 పరుగులు, విష్ణు సోలంకి 16 బంతుల్లో 50 పరుగులు చేశారు. సిక్కిం మీడియం పేసర్ రోషన్ కుమార్ నాలుగు ఓవర్లలో 81 పరుగులు ఇచ్చాడు. టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యంత చెత్త గణాంకాలతో కొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు ఓవర్లలో 73 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మ రికార్డును రోషన్ అధిగమించి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
Record Alert 🚨
349 runs 😮, 37 sixes 🔥
Baroda have rewritten the history books in Indore! They smashed 349/5 against Sikkim, the highest total in T20 history, & set a new record for most sixes in an innings – 37 👏#SMAT | @IDFCFIRSTBank
Scorecard: https://t.co/otTAP0gZsD pic.twitter.com/ec1HL5kNOF
— BCCI Domestic (@BCCIdomestic) December 5, 2024