ఛత్తోగ్రమ్ : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో దక్కించుకుంది. తొలి వన్డేలో ఓడినప్పటికీ రెండో మ్యాచ్‌లో పుంజుకున్న ఆ జట్టు.. గురువారం సిరీస్ విజేతను నిర్ణయించేందుకు జరిగిన మూడో పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటి 55 రన్స్ తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది.
మొదట బ్యాటింగ్ చేస్తూ నజ్ముల్ హోసేన్ శాంతో (105) శతకానికి తోడు లిటన్ దాస్ (76) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 24 ఓవర్లకు 107/3తో మెరుగ్గానే కనిపించిన కివీస్.. ముస్తాఫిజుర్ (5/43) పేస్‌కు కుదేలై 44.5 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (75), నిక్ కెల్లీ (59) పోరాటం సరిపోలేదు.