ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫీకర్ (106) శతకంతో కదం తొక్కాడు.
వ్యక్తిగతంగా అతడికి ఇది వందో టెస్టు. తద్వారా వందో టెస్టులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు స్థానం (11వ ఆటగాడు) సంపాదించాడు. ముష్ఫీకర్తో పాటు లిటన్ (128) సెంచరీతో రాణించగా బంగ్లా 476 పరుగుల భారీ స్కోరు చేసింది.