ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్(Bangladesh) జట్టు నవంబర్ 6న శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే.. ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. శనివారం ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో షకిబుల్ హసన్ బృందం సెషన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ‘ఈరోజు మాకు ట్రైనింగ్ సెషన్ ఉంది. కానీ, ఢిల్లీ వాతావరణం ఏమాత్రం బాగాలేదు. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా సెషన్‌ను రద్దు చేసుకోక తప్పలేదు’ అని బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహముద్ తెలిపాడు.
ఉపఖండంలో బలమైన జట్టుగా పేరొందని బంగ్లా వరల్డ్ కప్‌లో మాత్రం తేలిపోయింది. ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరు పరాజయాలతో సెమీస్ అవకాశాల్ని చేజార్చుకుంది. కెప్టెన్ షకిబుల్ హసన్‌తో పాటు స్టార్ ఆటగాళ్లు లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, ముఫ్ఫికర్ రహీం భారీ స్కోర్లు చేయకపోవడం.. బౌలింగ్‌లోనూ పస తగ్గడంతో బంగ్లా ముందంజ వేయలేకపోయింది.
శ్రీలంక
బంగ్లాదేశ్.. ఇకపై చాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) బెర్తు కోసం పోరాడనుంది. మరోవైపు..శ్రీలంకది కూడా దాదాపు అదే పరిస్థితి. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత బౌలర్ల దెబ్బకు 55 పరుగులకే కుప్పకూలిన లంక.. సెమీస్ రేసు నుంచి వైదొలిగింది.