ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీ 2..రోహిత్ శర్మ 3

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(857 రేటింగ్ పాయింట్లు), స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(825 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్(865 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకు సాధించాడు.
న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ టాప్‌లో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి జస్ప్రిత్ బుమ్రా ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్(తొమ్మిదో ర్యాంకు) బౌలింగ్ జాబితాలో మళ్లీ టాప్-10లోకి దూసుకొచ్చాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

