Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Bathukamma : జపాన్‌లో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. జపాన్ తెలుగు సమాఖ్య (జేటీఎస్) ఆధ్వర్యంలో స్థానిక కోమట్సుగవా పార్కులో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి.
Bathukamma : జపాన్‌లో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. రాజధాని టోక్యో నగరం తెలంగాణ సంస్కృతితో వెల్లివిరిసింది. జపాన్ తెలుగు సమాఖ్య (జేటీఎస్) ఆధ్వర్యంలో స్థానిక కోమట్సుగవా పార్కులో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. దాదాపు 200 మంది వరకు తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని చాటే దుస్తుల్లో అందరూ కుటుంబ సమేతంగా వేడుకలకు హాజరయ్యారు.
బతుకమ్మ పాటలుపాడుతూ, నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా మహిళలు, పిల్లలు, పెద్దలు ఈ వేడుకలు జరుపుకొన్నారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆరాధిస్తూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణలో జరుపుకొనే సంప్రదాయ బతుకమ్మ వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా జపాన్‌లో ఈ వేడుకలను జేటీఎస్ నిర్వహించడం విశేషం. వేడుకలకు హాజరైన వారికి మహిళలు ఆతిథ్యం అందించారు. జేటీఎస్ వాలంటీర్లు సంప్రదాయ వంటకాలైన పులిహోర, పలు రకాల స్వీట్లు, టీ వంటివి చేసి అతిథులకు అందించారు.

ఇలాంటి వేడుకలు జపాన్‌లోని తెలుగువారి మధ్య సంబంధాల బలోపేతానికి ఉపయోగపడతాయని జేటీఎస్ వాలంటీర్ మురళీధర్ అన్నారు. వేడుకలు జరుపుకొనేందుకు సరైన వేదిక లేకపోయినప్పటికీ, తాము విజయవంతంగా మన సంప్రదాయ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరి సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- bathukamma
- Japan
- Telangana
- Tokyo
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

