చెన్నై: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా ఓపెనర్ జకీర్ ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్లో అతను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 515 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. మూడవ రోజు టీ విరామ సమయం తర్వాత వికెట్ కోల్పోయింది. అంతకుముందు లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా టీ విరామ సమయానికి 56 రన్స్ చేసింది. జకీర్ హసన్ 33 రన్స్ చేసి టీ బ్రేక్ తర్వాత ఔటయ్యాడు. షాద్మాన్ ఇస్లామ్ 30, శాంతో ఒక పరుగుతో క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
India 🆚 Bangladesh | 1st Test | Day 03
TEA | Bangladesh need 459 runs#BCB #Cricket #INDvBAN #WTC25 pic.twitter.com/nXlw4umasi— Bangladesh Cricket (@BCBtigers) September 21, 2024