RSA vs BAN : దక్షిణాఫ్రికాను తక్కువకే కట్టడి చేసిన బంగ్లాదేశ్(Bangladesh) ఛేదనలో తొలి వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో ఓపెనర్ తంజిద్ హసన్(9) ఔటయ్యాడు. దాంతో, పరుగలు వద్ద బంగ్లా మొదటి వికెట్ పడింది. లక్ష్యం చిన్నదే కావడంతో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(9), సీనియర్ ప్లేయర్ లిట్టన్ దాస్(10)లు ఆచితూచి ఆడుతున్నారు. దాంతో, పవర్ ప్లేలో బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 29 రన్స్ కొట్టింది. ఇంకా ఆ జట్టు విజయానికి 85 ఇంకా రన్స్ కావాలి.
టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులను తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తున్న దక్షిణాఫ్రికాకు ఈసారి భారీ షాక్. ఊహించని బౌన్స్.. లో స్కోరింగ్ మ్యాచ్‌లకు కేరాఫ్ అయిన న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ బౌలర్లు సఫారీలను నిలువరించారు.
Bangladesh’s bowlers roared in the Big Apple 🐅https://t.co/uxia75vOfx #SAvBAN #T20WorldCup pic.twitter.com/KWLlxsk8ET
— ESPNcricinfo (@ESPNcricinfo) June 10, 2024
తంజిమ్ హసన్ షకిబ్((3/18) సంచలన స్పెల్ వేయడంతో దక్షిణాఫ్రికా టాప్ గన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 23 రన్స్‌కే నాలుగు కీలక వికెట్లు పడిన దశలో హెన్రిచ్ క్లాసెన్(46), డేవిడ్ మిల్లర్(29)లు గోడలా నిలబడ్డారు. ఐదో వికెట్‌కు 79 రన్స్ జోడించి పరువు కాపాడారు. దాంతో, నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 113 రన్స్ కొట్టింది.