Bangladesh Cricket : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడాలా? వద్దా? అనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్లో రేగుతున్నదుమారం చివరికి కీలక నిర్ణయానికి తీసింది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal)ను ‘ఇండియన్ ఏజెంట్’ అని పేర్కొన్న బంగ్లా బోర్డు ఆర్ధిక కమిటీ అధ్యక్షుడిపై వేటు పడింది. విధ్వంసక ఓపెనర్‌గా, సమర్ధుడైన నాయకుడిగా జట్టును నడిపించిన తమీమ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నజ్ముల్ ఇస్లామ్ అమిద్ను బంగ్లాదే|శ్ బోర్డు పదవి నుంచి తప్పించింది.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్వాన్ను తప్పించడంపై బంగ్లాదేవ్ క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ఇండియాకు పంపమని ఐసీసీకి లేఖ రాయడంతో ఇరుబోర్డుల మధ్య దూరం మరింత పెరిగింది.
The Bangladesh Cricket Board has removed Nazmul Islam as chairman of the board’s finance committee, following the CWAB’s player boycott of cricket in country until he resigns from his positionhttps://t.co/hwLHojGKeJ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 15, 2026
ఈ నేపథ్యంలో బంగ్లా బోర్డు ఆర్ధిక కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal)ను ‘ఇండియన్ ఏజెంట్'(Indian Agent) అని పేర్కొంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. నజ్ముల్ కామెంట్‌ను మాజీ ఆటగాళ్లు తీవ్రంగా ఖండించారు. అతడిని పదవి నుంచి తొలగిస్తేనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతామని భీష్మించారు. క్రికెటర్ల ఒత్తిడితో దిగివచ్చిన బంగ్లా బోర్డు గురువారం నజ్ముల్పై వేటు వేసింది.
ఈమధ్యే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్న తమీమ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పించడం దురదృష్టకరం. అందులో ఏ సందేహమూ లేదు. నేను ఒకవేళ బోర్డులో ఉండిఉంటే మనదేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునేవాడిని. అప్పటికప్పుడు ఆవేశంగా స్పందించడం సమస్యను జటిలం చేస్తుంది.
The BCB President has decided to release Mr. Najmul Islam from his responsibilities as Chairman of the Finance Committee of Bangladesh Cricket Board with immediate effect.
Earlier, Bangladesh players bycotted all cricketing activities till Najmul Islam’s resignation. pic.twitter.com/f50sdoiC2i
— Anees Ahmad Sheikh (@AN33S88) January 15, 2026
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సమస్యలు చర్చలతో పరిష్కారమవుతాయి. నేనైతే ప్రపంచ క్రికెట్లో మనజట్టు స్థాయిని ఆలోచించి నిర్ణయానికి వచ్చేవాడిని. ఈరోజు మన తీర్మానంతో బంగ్లా జట్టు పదేళ్లు వెనక్కి వెళ్లే అవకాశముంది. మన బోర్డుకు ఐసీసీ నుంచే 90 నుంచి 95 శాతం ఆదాయం వస్తోంది. అయితే.. అందిలానే నాకు కూడా బంగ్లా క్రికెట్‌కు శ్రేయస్సే తొలి ప్రాధాన్యం’ అని తమీమ్ పేర్కొన్నాడు.