దుబాయ్ : బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మార్చి నెలకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకున్నాడు. కాగా రువాండాకు చెందిన యువ క్రికెటర్ హెన్రిట్టె ఇషిమ్వె మహిళల విభాగంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది.
షకీబ్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 3-0తో గెలుచుకోవడంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఐర్లాండ్తోజరిగిన సిరీస్‌లోనూ షకీబ్ కీలకంగా వ్యవహరించాడు.