టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే బంగ్లాదేశ్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లలో అన్ని వికెట్లు నష్టపోయి కేవలం 73 పరుగులే చేసి.. ఆస్ట్రేలియాకు 74 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. అయితే.. బంగ్లాదేశ్ ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఏ ప్లేయరూ సరిగ్గా ఆడకపోవడంతో పాటు ఆస్ట్రేలియా టఫ్ బౌలింగ్ వేయడంతో వరుసగా బంగ్లా వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో షామిమ్ 18 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మహమ్మద్ నయిమ్ 16 బంతుల్లో 17 పరుగులు చేశాడు. మహ్మదుల్లా(కెప్టెన్) 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. మిగితా ఆటగాళ్లంతా 10 లోపే స్కోర్ చేసి పెవిలియన్ చేరారు. దీంతో 15 ఓవర్లకే బంగ్లా.. తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 5 వికెట్లు తీశాడు. స్టార్క్, హాజల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశాడు.
Bangladesh are bowled out for 73 ☝️
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Zampa with a five-wicket haul steals the show for Australia 🌟#T20WorldCup | #AUSvBAN | https://t.co/apDTWI2E8S pic.twitter.com/dTVhwNrGq7
What a spell from the Australian leggie 💫#T20WorldCup | #AUSvBAN | https://t.co/apDTWI2E8S pic.twitter.com/4wKdkVv6YV
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021