మిర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (5/49) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ తైజుల్ తిప్పేయడంతో సఫారీ బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు సమర్పించుకున్నారు.
9 పరుగుల వద్ద కెప్టెన్ మార్క్మ్ (6) వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..తైజుల్ స్పిన్ ధాటికి కంగుతిన్నది. టోనీ డీ జోర్జి(30), రికల్టన్ (27) ఆకట్టుకోగా, స్టబ్స్(23), బెడింగ్హామ్ (11), బ్రిట్జె (0) విఫలమయ్యారు. షకీబల్హసన్ తర్వాత టెస్టుల్లో 200 వికెట్లు తీసిన రెండో బంగ్లా బౌలర్గా తైజుల్ నిలిచాడు. అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకే కుప్పకూలింది. రబాడ (3/26), ముల్దర్ (3/22), మహారాజ్ (3/34) మూడేసి వికెట్లతో రాణించారు.