Balwan Punia : భారత రెజ్లర్ బజరంగ్ పూనియా (Bajrang Punia) ఇంట్లో విషాదం నెలకొంది. స్వతహా మల్లయోధుడు అయిన ఆయన తండ్రి బల్వాన్ పూనియా (Balwan Punia) కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న బల్వాన్ గురువారం తుదిశ్వాస విడిచారు. గత 18 రోజులుగా బజరంగ్ వాళ్ల నాన్న ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆరోగ్యం విషమించండంతో ఆయన మరణించారు. తండ్రి మృతి వార్తను బజరంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
తండ్రి బల్వాన్ స్ఫూర్తితో బజరంగ్ చిన్నవయసులోనే రెజ్లింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. కుమారిడి ఇష్టాన్ని గ్రహించిన ఆయన తానే తొలి కోచ్గా మారి శిక్షణ ఇచ్చారు. కుస్తీ పోటీలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు, నైపుణ్యాలను నేర్పించారు. తండ్రి మద్దతు, ప్రోత్సాహంతో బజరంగ్ అంతర్జాతీయంగా పతకాలతో మెరిశాడు.
बापूजी हमारे साथ नहीं रहे. आज शाम सवा छह बजे उन्होंने आख़िरी सांस ली.
उन्होंने बड़ी मेहनत से हम लोगों को यहाँ तक पहुंचाया था. वे हमारे पूरे परिवार की रीढ़ थे. समझ नहीं आ रहा कि उनके बिना आगे जीवन कैसा होगा.
उनका अंतिम संस्कार हमारे गाँव खुडन में सुबह 11 बजे किया जाएगा.
बजरंग… pic.twitter.com/h0omVp8SGa
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) September 11, 2025
‘బాపూజీ మాకు దూరమయ్యారు. గురువారం సాయంత్రం 6:15 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. మమల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారు. ఆయన మా కుటుంబానికి వెన్నెముకలాంటి వ్యక్తి. నాన్న లేకుండా జీవితం ఎలా గడుస్తుందో నాకు తెలియడం లేదు’ అని బజరంగ్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు. ఝజ్జర్ జిల్లాలోని ఖుందన్ గ్రామంలో తన తండ్రి అంత్యక్రియలు జరుపుతామని రెజ్లర్ వెల్లడించాడు.
చిన్నతనం నుంచే తండ్రి బల్వాయ్ శిక్షణ.. ఆపై కోచ్ల దిశానిర్దేశనంతో రాటుదేలాడు బజరంగ్. తన ఉడుంపట్టుతో రెజ్లింగ్ వీరుడిగా అవతరించిన అతడు 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో చరిత్ర సృష్టించాడు. తన కమారుడు ఒలింపిక్ మెడల్ సాధించినందుకు బల్వాయ్ పొంగిపోయాడు. నా కుమారుడు నా కలను సాకారం చేశాడు అని అందరితో చెప్పుకొని మురిసిపోయాడు బల్వాన్.