మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) పురుషుల డబుల్స్‌లో ఎన్ శ్రీరాం బాలాజీ, మిగుల్ ఏంజెల్ రియాస్ వరేలా జోడి.. రెండో రౌండ్లో ఓడిపోయింది. భారత ఆటగాడు బాలాజీ, మెక్సికో ప్లేయర్ వరేలా.. ఇద్దరూ గట్టి పోటీ ఇచ్చినా.. 6-7 (7), 6-4, 3-6 స్కోరుతో పోర్చుగీస్ జోడి నునో బోర్జెస్, ఫ్రాన్సిస్కో కాబ్రల్ చేతిలో పరాజయం చవిచూశారు. సుమారు రెండు గంటల 9 నిమిషాల పాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి సెట్ 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ట్రైబేకర్‌లో బోర్జెస్, కాబ్రల్ జోడి వత్తిడిలో పైచేయి సాదించింది. ఆ తర్వాత రెండో సెట్లో ఇండో-మెక్సిన్ జోడి తీవ్రంగా పోరాడింది. చాలా ఈజీగా ఆ సెట్‌ను సొంతం చేసుకున్నది. కీలకమై మూడవ సెట్లో బోర్జెస్-కాబ్రల్ జోడి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.