కర్తవ్యపథ్‌లో ఖేల్‌రత్న, అర్జున
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతాలు తెచ్చిన స్టార్ రెజ్లర్ల అవార్డుల వాపసీ కార్యక్రమం కొనసాగుతున్నది.
- అవార్డులు వదిలి వెళ్లిన వినేశ్ ఫొగాట్
- పోలీసుల అడ్డగింపు
- కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతాలు తెచ్చిన స్టార్ రెజ్లర్ల అవార్డుల వాపసీ కార్యక్రమం కొనసాగుతున్నది. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడు ఎంపికవడంతో ఆగ్రహించిన రెజ్లర్లు.. ఒక్కొక్కరుగా తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకగా.. బజరంగ్ పునియా ఖేల్త్న్రా, పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేశాడు.
ఇప్పుడు ఆ జాబితాలో మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా చేరింది. వినేశ్ శనివారం తనకు వచ్చిన ఖేల్త్న్ర, అర్జున అవార్డులను తిరిగి ఇచ్చేసింది.ప్రధాని కార్యాలయానికి వెళ్లాలని ప్రయత్నించిన స్టార్ రెజ్లర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. వినేశ్ తనకు వచ్చిన పురస్కారాలను కర్తవ్యపథ్‌లో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లింది. ఇటీవల జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికల్లో సంజయ్ సింగ్ గెలుపొందగా.. దీనికి నిరసనగా రెజ్లర్లు తిరిగి పోరుబాట పట్టారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్ కనుసన్నల్లోనే తిరిగి డబ్ల్యూఎఫ్ఐ నడుస్తున్నదనే ఆవేదనతో మల్లయోధులు అవార్డులు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

