చెంగ్డు: చైనాలో జరుగుతున్న ఆసియా అండర్-17, అండర్-15 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్లు లక్ష్య రాజేశ్, దీక్ష సుధాకర్, శైనా మణిముత్తు క్వార్టర్స్‌కు చేరారు. శుక్రవారం ఇక్కడ జరిగిన అండర్-17 గర్ల్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో ఆరో సీడ్ దీక్ష.. 21-19, 21-15తో పిన్ హువాన్ చియాంగ్ (చైనీస్ తైఫీ)ను ఓడించింది.
లక్ష్య.. 21-16, 21-11తో లి యున్ సియో (దక్షిణ కొరియా)ను చిత్తుచేసి క్వార్టర్స్ చేరింది. బాలికల అండర్-15 ప్రిక్వార్టర్స్‌లో మణిమత్తు.. 21-17, 21-16తో లి మన్ (చైనా)పై గెలిచింది. గర్ల్స్ డబుల్స్‌లో అదితి, వృద్ధి జోడీతో పాటు బాయ్స్ డబుల్స్‌లో చరణ్, హరికృష్ణ జోడీ కూడా క్వార్టర్స్ చేరింది.