Babar Azam | లాహోర్: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్‌బై చెప్పాడు. వన్డే, టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించాడు. అతడు ఇలా చేయడం ఏడాదికాలంలో ఇది రెండోసారి. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ గ్రూప్ దశకే పరిమితమవడంతో అతడు కెప్టెన్సీని వదులుకున్నా కొద్దిరోజుల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మళ్లీ అతడికి ఆ బాధ్యతలను అప్పజెప్పింది.