Babar Azam : అనిశ్చితికి మారుపేరైన ఆటతోనే కాదు వివాదాస్పద నిర్ణయాలతోనూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరోసారి వైరలవుతోంది. విదేశీ సిరీస్ ముగియడమే ఆలస్యం కెప్టెన్లను మార్చే పీసీబీ మళ్లీ బాబర్ ఆజాం (Babar Azam)తో బంతాట ఆడుతోంది. ఒకప్పుడు కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ను ఆటగాడిగా పరిమితం చేసిన పాక్ బోర్డు.. మళ్లీ అతడికి పగ్గాలు అప్పగించింది. వరసగా విఫలవుతున్న షాన్ మసూద్ (Shan Masood) స్థానంలో బాబర్‌కు సారథ్యం అప్పగించారు సెలెక్టర్లు. వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లకు బాబర్ కెప్టెన్‌గా ఆదివారం స్క్వాడ్‌ను ప్రకటించింది పీసీబీ.
పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజాం తిరిగొచ్చాడు. మూడేళ్ల క్రితం టెస్టు సారథ్యాన్ని కోల్పోయిన అతడు మళ్లీ వెస్టిండీస్ పర్యటనతో జట్టును నడిపించనున్నాడు. షాన్ మసూద్ నాయకత్వంలో పాక్ వరస పరాజయాల నేపథ్యంలో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. 16 మ్యాచుల్లో 12 పరాజయాలు, డబ్ల్యూటీసీలో వెనుకంజతో ఆగ్రహించిన అభిమానులు, మాజీ ఆటగాళ్లు మసూద్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. దాంతో, అనుభవజ్ఞుడైన బాబర్వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు.
BREAKING NEWS: Babar Azam is back as Pakistan’s Test captain pic.twitter.com/cCM6OL06bK
— Cricinfo (@cricinfo) July 5, 2026
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఆదివారం బాబర్ సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఇంగ్లండ్ పర్యటనకు 17వ సభ్యుడిగా సాద్ షకీల్‌ను తీసుకున్నారు. జూలై 25 నుంచి పాక్, విండీస్ మధ్య తొలి టెస్టు జరుగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జూలై 29 నుంచి రెండో మ్యాచ్ ఉంటుంది. అనంతరం పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్తుంది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 13 వరకూ లీడ్స్ లార్డ్స్, బర్మింగ్హమ్లో ఆతిథ్య జట్టుతో బాబర్ సేన తలపడనుంది.
Babar Azam is back as captain, while Shaheen Shah Afridi, Hasan Ali and Noman Ali have all been left out of Pakistan’s Test squad to tour the West Indies and England pic.twitter.com/QcBQiVmxD2
— Cricinfo (@cricinfo) July 5, 2026
పాకిస్థాన్ స్క్వాడ్ (వెస్టిండీస్, ఇంగ్లండ్ సిరీస్‌కు) : బాబర్ ఆజాం(కెప్టెన్), అమిర్ జమల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజన్ అవైస్, ఇమాముల్ హక్, ఖుర్రం షహజాద్, మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ అలీ, రిజ్వాన్(వికెట్ కీపర్), మొహమ్మద్ అవైస్ జఫర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ(వికెట్ కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, షాన్ మసూద్, ఉబైద్ షా.