BCCI : మూడో టీ20లో అద్బుత విజయంతో సిరీస్‌లో ముందంజ వేసిన భారత్‌కు బిగ్ షాక్. ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉంటాడనుకున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) అనూహ్యంగా సిరీ స్ నుంచి వైదొలిగాడు. అనారోగ్యంతో ధర్మశాల మ్యాచ్‌లో ఆడని అక్షర్.. తదుపరి రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడని సోమవారం బీసీసీఐ తెలిపింది. అయితే.. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారు? అనేది మాత్రం వెల్లడించలేదు.
అక్షర్ బదులు కుల్దీప్ యాదవ్ చివరి రెండు మ్యాచుల్లో ఆడనున్నాడు. ధర్మశాలలో రెండు వికెట్లు తీసిన కుల్దీప్ సఫారీలను 117కే కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. దాంతో.. అతడినే రెండు చివరి టీ20లకు కొనసాగించే అవకాశముంది.
🚨 NEWS 🚨#TeamIndia allrounder, Axar Patel has been ruled out of the remaining two @IDFCFIRSTBank T20Is against South Africa due to illness.
🔽 Details | #INDvSA | @akshar2026 https://t.co/CZja7iaLNm
— BCCI (@BCCI) December 15, 2025