జీమెన్(చైనా): జీమెన్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ టోర్నీలో భారత యువ అథ్లెట్ అవినాశ్ సాబ్లె నిరాశపరిచాడు. శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టిపుల్చేజ్ను అవినాశ్ 8 నిమిషాల 22.59 సెకన్లలో ముగించి 13వ స్థానంలో నిలిచాడు. గత సెప్టెంబర్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన సాబ్లె స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు.
మొత్తం 16 మంది అథ్లెట్లు పూర్తి చేసిన పోటీలో సామ్యూల్(8:05:61సె), సోఫెన్ ఎల్ బకాలీ(8:06:66సె), సిమోన్ క్రిపోప్(8:07:12సె) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మే 3న షాంఘైలో జరిగే డైమండ్ లీగ్లో సాబ్లె పోటీపడనున్నాడు.