PBKS vs RR : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు షాక్. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అధర్వ తైడే(15) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో తైడే ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను కుల్దీప్ సేన్ అందుకున్నాడు.
దాంతో, 27 పరుగుల వద్ద రాజస్థాన్‌కు తొలి బ్రేక్ లభించింది. ప్రస్తుతం జానీ బెయిర్‌స్టో(10), ప్రభ్సిమ్రాన్ సింగ్(3)లు ఆడుతున్నారు. ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 31/1.