IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది గుజరాత్. మొదటగా అర్ధ శతకం తర్వాత రెచ్చిపోయి ఆడుతున్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60), సాయి సుదర్శన్(56)లు వెంటవెంటనే ఔటయ్యారు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన గిల్ .. బౌండరీ లైన్ వద్ద మర్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో సుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ సులువగా అందుకున్నాడు. దాంతో, గుజరాత్ 2 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
🎬 A superb opening act of 1️⃣2️⃣0️⃣ that deserved all the applause 👏👏
Both openers depart as #GT are 123/2.
Updates ▶ https://t.co/VILHBLEerV #TATAIPL | #LSGvGT | @gujarat_titans pic.twitter.com/MtGXKIUS8e
— IndianPremierLeague (@IPL) April 12, 2025
టాస్ ఓడిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(53), సాయి సుదర్శన్(51)లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. తొలి వికెట్‌కు 120 రన్స్ జోడించి పటిష్ట స్థితిలో నిలిపాడు. సుదర్శన్ సైతం అతడిని అనుసరించడంతో.. గుజరాత్ జోరుకు బ్రేక్ పడింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై చితక్కొట్టిన వాషింగ్టన్ సుందర్‌ను బిష్ణోయ్ బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు. ప్రస్తుతం జోస్ బట్లర్(4), షెర్ఫానే రూథర్‌ఫొర్డ్()లు క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు స్కోర్.. 109-3.