AUSvsPAK 2nd Test: ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఎదురీదుతోంది. తొలి రోజు వర్షార్పణమైనా రెండో రోజు పూర్తిగా సాగిన ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియాను 318 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 6 కీలక వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులు వెనకబడి ఉంది.
187-3 పరుగుల ఓవర్ నైట్ స్కోరువద్ద రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్‌కు మార్నస్ లబూషేన్ (63) ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ (17) విఫలమయ్యాడు. మిచెల్ మార్ష్ (41) ఫర్వాలేదనిపించాడు. లబూషేన్‌ను అమీర్ జమాల్ ఔట్ చేయడంతో ఆసీస్ మిడిలార్డర్ పతనం వేగంగా సాగింది. హెడ్, అలెక్స్ కేరీ (4)ని షహీన్ అఫ్రిది ఔట్ చేయగా స్టార్క్ (9)ను మిర్ హమ్జా పెవిలియన్ చేర్చాడు. ఆసీస్ సారథి కమిన్స్ (13)ను అమీర్ జమాల్ ఔట్‌చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. కానీ అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54) లు రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని కమిన్స్ విడదీశాడు. షఫీక్.. కమిన్స్ వేసిన 35వ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్ ఆజమ్ (1) మరోసారి చేతులెత్తేశాడు. సౌద్ షకీల్ (9) సైతం నిరాశపరిచాడు. మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ (5) కూడా ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్.. 55 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
Advantage Australia as Pakistan wobble in the final session.#WTC25 | #AUSvPAK | 📝: https://t.co/FEI27d1Zbn pic.twitter.com/qZLbTubagZ
— ICC (@ICC) December 27, 2023