లార్డ్స్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(World Test Championship) బుధవారం నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానున్నది. దక్షిణాఫ్రికాతో ఆ ఫైనల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు అక్కడకు చేరుకున్నది. అయితే ప్రాక్టీస్ కోసం శనివారం లార్డ్స్ మైదానం వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం దక్కలేదు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో శిక్షణకు పర్మిషన్ దక్కలేదు. ఈ ఘటనకు చెందిన రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. ప్యాట్ కమ్మిన్స్ జట్టుకు అనుమతి దక్కకపోవడం పట్ల కారణం ఏంటో తెలిసింది.
ఇంగ్లండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇండియా కూడా ఇటీవల లార్డ్స్‌కు చేరుకున్నది. శనివారం ఇండియన్ జట్టు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆసీస్ జట్టు అక్కడకు రావడంతో వాళ్లకు ఎంట్రీ దక్కలేదు. ఇండియన్ జట్టుకు ట్రైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చినట్లు ఫాక్స్ క్రికెట్ పేర్కొన్నది. వాస్తవానికి జూన్ 11 నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ ఇండియన్ జట్టు జూన్ 20 నుంచి టెస్టు సిరీస్ ఆడనున్నది. శనివారం ఆసీస్ ఆటగాళ్లకు పర్మిషన్ దక్కకున్నా.. ఆదివారం మాత్రం లార్డ్స్‌లోనే ప్రాక్టీస్ చేశారు.