మెల్బోర్న్: వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్లో అయినా ఆడతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు సారథిగా ఉన్న కమిన్స్.. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు.
ఐపీఎల్‌కు అతడు దూరమవనున్నాడని వార్తలు వస్తున్న వేళ కమిన్స్ స్పందిస్తూ.. ‘త్వరలో నాకు మరో స్కాన్ చేయాల్సి ఉంది. ఒకవేళ అంతా బాగుంటే నేను ఐపీఎల్ కోసం సిద్ధమవుతా. టెస్టులతో పోల్చితే టీ20లు ఆడటం తేలిక’ అని అన్నాడు.