Australian Open | ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురయింది. విజయంతో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించాలనుకున్న ఆమె ఆశలు ఫలించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా
మెల్బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురయింది. విజయంతో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించాలనుకున్న ఆమె ఆశలు ఫలించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ ఓటమిపాలైంది. ఫైనల్లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో 7-6, 6-2తో సానియా జోడీ ఓటమిచవిచూసింది. దీంతో ఓటమితో టెన్నిస్ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.

సానియా కెరీర్లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. 2009లో మహేశ్ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ (ఆస్ట్రేలియన్ ఓపెన్) కైవసం చేసుకున్నది. ఆ తర్వాత మరో ఐదు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు గెలుపొందింది. వాటిలో రెండు మిక్స్డ్ డబుల్స్, మూడు మహిళ డబుల్స్ ఉన్నాయి. మొత్తంగా ఆమె 43 డబుల్స్ టైటిళ్లను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాలపాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ప్లేస్‌లో కొనసాగింది.

కాగా, తన చివరి మ్యాచ్‌లో ఓటమి చెందడంతో సానియా మీర్జా కన్నీరుపెట్టుకున్నారు. విజయం సాధించిన బ్రెజిల్ జోడీ లూయిసా, రఫెల్‌ను అభినందించారు.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
BRAZILIAN BREAKTHROUGH 🇧🇷
Rafael Matos & @Luisa__Stefani are the #AusOpen mixed doubles champions 🏆#AO2023 pic.twitter.com/yeYMslxva1
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

