Ramagiri : ‘పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి’
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు. ఎస్బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో
– ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్
రామగిరి, డిసెంబర్ 19 : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు. ఎస్బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో నిర్వహించే అంశాలను ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్పీ రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు వ్యర్థ కాగితాలతో తయారు చేసిన పలు అలంకరణ, జీవశాస్త్ర ప్రాజెక్టులను పరిశీలన చేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులు కావునా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచి భవిష్యత్‌కు బాటలు వేయాలనే లక్ష్యంతోనే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి సమీపంలోని వారందరికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి చైతన్యం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పూర్ణిమా పాల్గొన్నారు.

Ramagiri : ‘పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

