Bradman Cap : లెజెండరీ ఆటగాళ్ల వస్తువులను అపురూపంగా భావిస్తారు అభిమానులు. తమ స్టార్ క్రికెటర్ల గ్లోవ్స్, క్యాప్, బ్యాట్.. వంటి వాటిని వేలంలో భారీ ధరతో దక్కించుకుంటారు కొందరు. తాజాగా ఆస్ట్రేలియా వెటరన్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Donald Bradman) టెస్ట్ క్యాప్ రికార్డు ధర పలికింది. యాషెస్ సిరీస్(Ashes Series)లో ఈ దిగ్గజ ప్లేయర్ ధరించిన ఈ గ్రీన్ క్యాప్(Baggy Green Cap)ను ఆ దేశంలోని జాతీయ మ్యూజియం 4,38,500 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.2 కోట్లు)కు సొంతం చేసుకుంది.
సుదీర్ఘ ఫార్మాట్లో బ్రాడ్‌మన్ ధరించిన 11 క్యాపుల్లో ఇది ఒకటి. 1947-47 మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో సారథిగా వ్యవహరించిన ఈ వెటరన్ ఈ క్యాప్‌తోనే మైదానంలోకి దిగాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు సిరీస్ ఇది. సంచలన ప్రదర్శనతో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన కంగారూ టీమ్ 3-0తో సిరీస్ గెలుపొందింది. అందుకే ఈ క్యాప్‌ను ప్రత్యేకంగా, జాతి సంపదగా భావిస్తారు ఆస్ట్రేలియన్లు. రూ.2 కోట్లు వెచ్చించి మరీ ఈ స్పెషల్ దక్కించుకుంది కాన్‌బెర్రాలోని మ్యూజియం. ఈ మొత్తంలో మ్యూజియం నిర్వాహకులు సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బును క్రికెట్ ఆస్ట్రేలియాకు చెల్లించనున్నాయి.
What a catch – we just acquired an iconic piece of Aussie history! 🙌
This baggy green cap was worn by Sir Donald Bradman, our country’s most celebrated batsman, during the 1946-47 Ashes tour of Australia 🏏
The cap will be displayed in our Landmarks gallery. pic.twitter.com/xEia9Ii7Bn
— National Museum of Australia (@nma) August 29, 2025
‘ఆస్ట్రేలియాకు ఆడిన గొప్ప బ్యాటర్లలో ఒకడైన డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఒకరు. ఆయన బ్యాగీ గ్రీన్ క్యాప్ మా దేశ సంపద. రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదం నుంచి కోలుకోవడంలో ఆస్ట్రేయన్లకు క్రీడాకారులు పాత్ర మరవలేనది. మ్యూజియంలో ఈమధ్యే ప్రారంభించిన బ్రాడ్‌మన్ గ్యాలరీలో ఈ క్యాప్‌ను ప్రదర్శనకు ఉంచుతాం’ అని మ్యూజియం డైరెక్టర్ క్యాథరీన్ మెక్మహొన్ (Katherine McMahon) వెల్లడించింది.