సిడ్నీ: చాంపియన్స్ ట్రోఫీ ఎదుట ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి ఆసీస్ పేస్ వీరులు జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా తప్పుకోగా మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సైతం టోర్నీకి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు తప్పుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం తెలిపింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌కు స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించనున్నాడు.